అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Selloff | గ్యాపఅప్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా సెల్లాఫ్‌కు గురవుతోంది. ప్రధానంగా బ్యాంకు షేర్లలో అమ్మకాలతో ప్రధాన సూచీలు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లనుంచి అందుతున్న ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
Stock Market Selloff | లాభాలతో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) సోమవారం ఆశావహ దృక్పథంతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 502 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మరో 241 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి ప్రాఫిట్ బుకింగ్‌తో 1,664 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 63 పాయింట్లు లాభపడింది. అక్కడినుంచి సెల్లాఫ్ కు గురై 479 పాయింట్లు తగ్గింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 766 పాయింట్ల నష్టంతో 83,153 వద్ద, నిఫ్టీ 231 పాయింట్ల నష్టంతో 25,569 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 9 స్టాక్స్ లాభాలతో, 21 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. టీసీఎస్ 4.40 శాతం, టెక్ మహీంద్రా 3.45 శాతం, మారుతి 2.25 శాతం, ఇన్ఫోసిస్ 1.79 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.69 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టాటా స్టీల్ 7.71 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.89 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.21 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.05 శాతం, ఎస్బీఐ 1.97 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Nov 23 Market Analysis | నెగెటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు..గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ