అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nov 23 Market Analysis | ప్రపంచవ్యాప్తంగా ఏఐ(AI) ఆధారిత టెక్నాలజీ స్టాక్స్‌లో పతనం కొనసాగుతోంది. దీంతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌తోపాటు యూరోప్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.
ప్రధాన ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం సైతం నష్టాల బాటలో పయనిస్తున్నాయి. అయితే గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) పాజిటివ్ గా ఉండడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Nov 23 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 5.28 శాతం, ఎస్ అండ్ పీ 3.70 శాతం నష్టపోయాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 1.57 శాతం లాభంతో ఉంది.
Nov 23 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 2.67 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.93 శాతం నష్టపోగా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ ఫ్లాట్‌గా ముగిశాయి.
Nov 23 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 8.10 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.65 శాతం లాభంతో, జపాన్‌కు చెందిన నిక్కీ 5.33 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 5.25 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.53 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.45 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.43 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.70 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా తొమ్మిదో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 10,308 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డీఐఐలు గత సెషన్‌లో రూ. 4,859 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 63 పైసలు బలపడి 92.67 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 103.72 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.94 శాతం వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.34 నుంచి 1.43 కు పెరిగింది.
- విక్స్ 7.51 శాతం పెరిగి 17.32 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 92.02 డాలర్ల వద్ద ఉంది.