Komatireddy 100 Seats | వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Komatireddy 100 Seats | రాష్ట్రంలో కాంగ్రెస్​ మళ్లీ అధికారంలోకి వస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నేతలు, కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. పార్టీలో ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. తన ప్లాన్ ప్రకారం పోతే.. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామని చెప్పారు.

Komatireddy 100 Seats | ఓట్ల తొలగింపుపై ఆగ్రహం

ఎస్​ఐఆర్​ పేరిట ఓట్లు తొలగించడంపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ నేతలు నడ్డా, నితిన్ నబిన్‌ తెలంగాణ (Telangana) పర్యటనపై విమర్శలు చేశారు. రాష్ట్రానికి వారు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రధాన కమిషనర్​ జ్ఞానేశ్​కుమార్​కు శిక్ష పడితే జీవితాంతం అనుభవించాల్సి ఉంటుందని న్యాయవాదులు తనతో చెప్పారన్నారు.

ఇది కూడా చదవండి..: Revanth Reddy | ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసు.. సీఎం కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *