Indiramma Life Insurance | ఇందిరమ్మ జీవిత బీమా అందరూ సద్వినియోగం చేసుకోవాలి..

ఇందిరమ్మ జీవిత బీమాను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Life Insurance | ఇందిరమ్మ జీవిత బీమాను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి సూచించారు. (Kamareddy) మున్సిపల్ పరిధిలోని 13వ వార్డ్​లో ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకాన్ని ఆమె ప్రారంభించారు.

Indiramma Life Insurance | దరఖాస్తు చేసుకోవాలి

ఛైర్​పర్సన్​ మాట్లాడుతూ బీమా అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, పెద్ద దిక్కును కోల్పోయిన పరిస్థితిలో కుటుంబం ఆత్మగౌరవానికి, పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీ అని అన్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం అందించే గొప్ప పథకం ఈ ఇందిరమ్మ జీవిత బీమా పథకం అని తెలిపారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని వెళ్లాలని, నామినీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొత్తపల్లి లలిత, కమిషనర్ పర్వతాలు, నాయకులు కళ్లెం సత్యం, సిద్ధిఖ్, యూనస్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Indur Ayyappa Pilgrimage | తమిళనాడుకు చేరుకున్న ఇందూరు అయ్యప్పల పాదయాత్ర…

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *