అక్షరటుడే, కామారెడ్డి: Road Accident | చెరుకు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్, కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ఘటన రామారెడ్డి మండలం (Ramareddy Mandal)లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
Road Accident | పోసానిపేట–గోకుల్ తండా మధ్య..
మండలంలోని పోసానిపేట-గోకుల్ తండా గ్రామాల మధ్య చెరుకు ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వ్యక్తి ట్రాక్టర్ నడుపుతున్న రమేష్ (45)గా పోలీసులు గుర్తించారు. మృతుడు మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బర్రింకల తండాకు చెందినవారు. గాయపడ్డ వారు రాజు, సక్రు, గోపి, రమేష్, రాజేందర్ గా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు స్థానికులు తరలించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామారెడ్డి పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Indiramma Life Insurance | ఇందిరమ్మ జీవిత బీమా అందరూ సద్వినియోగం చేసుకోవాలి..