Tipper Engine Fire | టిప్పర్ ఇంజిన్‌లో మంటలు.. డ్రైవర్​కు తప్పిన ప్రమాదం

shashi kiran Mottala
Tipper Engine Fire | టిప్పర్ ఇంజిన్‌లో మంటలు.. డ్రైవర్​కు తప్పిన ప్రమాదం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Tipper Engine Fire | రోడ్డుపై వెళ్తున్న ఓ టిప్పర్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు, మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే టిప్పర్‌ను (Tipper) అక్కడే నిలిపి కిందికి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన నాగిరెడ్డిపేట(Nagireddypeta) మండలం బంజారా తండా సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది.

Tipper Engine Fire | మట్టిలోడ్​తో వెళ్తున్న టిప్పర్​..

ఎస్సై భార్గవ్ గౌడ్ (Nagireddypeta police) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలం బంజారా తండా సమీపంలో మట్టిలోడ్​తో వెళ్తున్న టిప్పర్​లో మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఫైర్​స్టేషన్ (Fire station)​ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. వైరింగ్ డిఫాల్ట్ వల్లే (engine fire) మంటలు చెలరేగి ఉండొచ్చని డ్రైవర్, ఫైర్ అధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో (Weather) మార్పుల కారణంగా ఎండలు తీవ్రం కావడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వాహనాలను జాగ్రత్తగా నడపాలని, ఇంజిన్ వేడెక్కకుండా తరచుగా తనిఖీ చేయించుకోవాలని ఎస్సై సూచించారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy | గవర్నర్​ను కలిసిన సీఎం రేవంత్​రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *