తెలంగాణHyderabad Rains | హైదరాబాద్​లో వర్షం.. పలుచోట్ల వడగళ్ల వాన..

Hyderabad Rains | హైదరాబాద్​లో వర్షం.. పలుచోట్ల వడగళ్ల వాన..

హైదరాబాద్​ నగరంలోని వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. అలాగే కొన్ని చోట్ల వడగళ్లతో కూడిన వర్షం కురిసినట్లు తెలుస్తోంది.

అక్షరటుడే, హైదరాబాద్​: Hyderabad Rains | హైదరాబాద్​ నగరంలోని వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. అలాగే కొన్ని చోట్ల వడగళ్లతో కూడిన వర్షం కురిసినట్లు తెలుస్తోంది. ఎల్బీ నగర్, అల్వాల్, మల్కాజ్​గిరి, కుత్బుల్లాపూర్​, కూకట్​పల్లి, కంటోన్మెంట్​, కాప్రా, కొంపల్లి, బాలానగర్, దుండిగల్, బాచుపల్లి, తదితర ప్రాంతాల్లో భారీ గాలులతో వర్షం కురుస్తోంది. అయితే రాత్రి 7 గంటల వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Hyderabad Rains | జిల్లాల్లోనూ వర్షాలు

హైదరాబాద్​ నగరంలో వర్షం పడుతుండగా.. వివిధ జిల్లాల్లోనూ కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి మెదక్, కరీంనగర్, మెదక్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అంతేకాకుండా రంగారెడ్డి, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌లో రానున్న రెండు గంటల్లో చెదురుమదురు వానలు కురవొచ్చని తెలిపారు.

Hyderabad Rains

ఇది కూడా చదవండి..: Heavy Rain Alert | నేడు భారీ వర్ష సూచన

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....