బిజినెస్​May 15 Market Analysis | ఎరుపెక్కిన ఆసియా మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న...

May 15 Market Analysis | ఎరుపెక్కిన ఆసియా మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ఆసియా మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ సైతం నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 15 Market Analysis | పశ్చిమాసియా(West asia)లో శాంతికి బాటలు పడతాయన్న ఆశలతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ , యూరోప్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. దీనికితోడు అమెరికా అధ్యక్షుడి చైనా పర్యటన సారాంశం కోసం ఆసియా మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండడంతో శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మాత్రం నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) నష్టాలతో ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

May 15 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.88 శాతం, ఎస్ అండ్ పీ 0.77 శాతం లాభపడ్డాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.26 శాతం నష్టంతో ఉంది.

May 15 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.31 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.92 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.46 శాతం పెరిగాయి.

May 15 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 3.14 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.18 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.07 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.49 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.33 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.14 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.23 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు నెగెటివ్ గా ప్రారంభం కానున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా ఏడు సెషన్ý తర్వాత నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 187 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డీఐఐలు వరుసగా పద్నాలుగో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 684 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.93 నుంచి 1.17కు పెరిగింది.
  • విక్స్ 4.13 శాతం తగ్గి 18.61 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 107.21 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.05వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.52 వద్ద ఉన్నాయి.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడి 95.76 వద్ద ఉంది.

Bhopal Pregnant Woman Suicide | విషాదం.. గర్భిణి ఆత్మహత్య.. అత్త రిటైర్డ్ జడ్జి, భర్త లాయర్ అయినా వేధింపులు తప్పలేదా?

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Land Rover Crash | హైదరాబాద్​లో ల్యాండ్​రోవర్​ కారు బీభత్సం

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Hyderabad Land Rover Crash | హైదరాబాద్​ (Hyderabad)నగరంలో...

Gas Cylinder Escort| గ్యాస్ సిలిండర్ల బండికి భారీ పోలీస్ ఎస్కార్ట్ ..ఎక్కడంటే!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Gas Cylinder Escort|సాధారణంగా ముఖ్యమంత్రులో, మంత్రులో వెళ్తుంటే భారీ పోలీస్...

Stock Market Gains | ఐటీ సెక్టార్‌లో కొనుగోళ్ల మద్దతు.. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains | ఐటీ షేర్లలో...

Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక: డీఎఫ్​​వో సిద్ధార్థ విక్రమ్​ సింగ్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ​: Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి...