బిజినెస్​May 15 Gold Rates | భగభగమంటున్న పసిడి.. మూడు రోజుల్లోనే భారీగా పెరుగుదల!

May 15 Gold Rates | భగభగమంటున్న పసిడి.. మూడు రోజుల్లోనే భారీగా పెరుగుదల!

దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి ఆకాశాన్ని తాకుతున్నాయి. గత మూడు రోజుల్లోనే తులం బంగారం ధర రూ.13 వేలకుపైగా పెరగగా, కిలో వెండి ధర రూ.20 వేలకుపైగా ఎగబాకింది. పెళ్లిళ్ల సీజన్‌లో ఈ పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చాలామంది మహిళలు రోల్డ్ గోల్డ్ నగల వైపు మొగ్గు చూపుతున్నారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 15 Gold Rates | దేశంలో బంగారం ధరలు Gold Rates మళ్లీ పరుగులు పెడుతున్నాయి. కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోలు తప్పనిసరిగా భావించే కుటుంబాలకు ఈ ధరలు పెద్ద షాక్‌గా మారాయి.

గత మూడు రోజుల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారం ధర రూ.13 వేలకుపైగా పెరగడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో వెండి ధరలు కూడా ఊహించని రీతిలో ఎగబాకాయి.

కిలో వెండి ధరపై ఏకంగా రూ.20 వేలకుపైగా పెరుగుదల నమోదైంది. దీంతో బంగారం, వెండి కొనుగోలు సామాన్యులకు దూరమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

May 15 Gold Rates | రోల్డ్ గోల్డ్ వైపు మొగ్గు..

దేశీయ మార్కెట్‌లో 15 date నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,340 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,810గా ఉంది. ఈ ధరలు సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది మహిళలు రోల్డ్ గోల్డ్ Rold Gold నగల వైపు మొగ్గు చూపుతున్నారు. అచ్చం బంగారం నగల మాదిరిగానే కనిపించే ఈ ఆభరణాలు తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో వాటికి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం తాత్కాలికంగా ధరించేందుకు రోల్డ్ గోల్డ్‌ను ఎక్కువగా ఎంపిక చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

May 15 Gold Rates| నగరాల వారీగా..

  • హైదరాబాద్‌, విజయవాడలో Vijaywada 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,340 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,48,810గా ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,62,270 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,48,960గా నమోదైంది.
  • ముంబయిలో 24 క్యారెట్ల ధర రూ.1,62,340 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,48,810గా కొనసాగుతోంది.
  • చెన్నైలో దేశంలోనే అత్యధికంగా చెన్నైలో బంగారం ధరలు నమోదయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,64,190 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,50,510గా ఉంది.
  • బెంగళూరు, కోల్‌కతాలో ఈ రెండు నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం రూ.1,62,340, 22 క్యారెట్ల బంగారం రూ.1,48,810 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరలు కూడా తగ్గేదేలే అన్నట్లు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.3,14,900 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,99,900గా ఉంది.

Khushbu | “నడకే జిమ్‌”… 32 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన నటి ఖుష్బూ ఫిట్‌నెస్ ప్రయాణం!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Land Rover Crash | హైదరాబాద్​లో ల్యాండ్​రోవర్​ కారు బీభత్సం

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Hyderabad Land Rover Crash | హైదరాబాద్​ (Hyderabad)నగరంలో...

Gas Cylinder Escort| గ్యాస్ సిలిండర్ల బండికి భారీ పోలీస్ ఎస్కార్ట్ ..ఎక్కడంటే!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Gas Cylinder Escort|సాధారణంగా ముఖ్యమంత్రులో, మంత్రులో వెళ్తుంటే భారీ పోలీస్...

Stock Market Gains | ఐటీ సెక్టార్‌లో కొనుగోళ్ల మద్దతు.. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains | ఐటీ షేర్లలో...

Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక: డీఎఫ్​​వో సిద్ధార్థ విక్రమ్​ సింగ్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ​: Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి...