Hailstorm Rain | కామారెడ్డిలో వడగళ్ల వాన..ఆందోళనలో రైతన్న

Shashi kiran Mottala
Hailstorm Rain | కామారెడ్డిలో వడగళ్ల వాన..ఆందోళనలో రైతన్న

అక్షరటుడే, కామారెడ్డి: Hailstorm Rain | పట్టణంలో (Kamareddy) ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం (Heavy rain) సృష్టించింది. సాయంత్రం 3:30 గంటల నుంచి సుమారు గంటపాటు భారీగా వడగండ్లు కురిశాయి. దాంతో పట్టణంలో జనజీవనం స్తంభించింది.

Hailstorm Rain | వడగండ్ల ధాటికి..

వడగండ్ల ధాటికి ప్రజలు బయటకు వెళ్లలేకపోయారు. రోడ్లపై ఉన్న వాహనదారులు వడగండ్ల వానతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు గత వారం రోజులుగా కామారెడ్డిలో సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. గ్రామాల్లో చేతికి వచ్చిన వరిపంట (Rice Crop) వడగండ్ల వర్షానికి నెలకోరుగుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కొనుగోళ్లు మొదలు కావడంతో రైతులు భయపడుతున్నారు.

ఇది కూడా చదవండి:Singer Mangli | సింగర్ మంగ్లీని బహిష్కరించాలని ఫిర్యాదు

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *