నిజామాబాద్Telangana Protest Arrests | మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్

Telangana Protest Arrests | మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్

హైదరాబాద్‌లో శుక్రవారం సీఎం ఇంటిముట్టడి కార్యక్రమానికి మలిదశ ఉద్యమకారులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో పోలీసులు పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

అక్షరటుడే, బాన్సువాడ: Telangana Protest Arrests | హైదరాబాద్‌ (Hyderabad)లో శుక్రవారం సీఎం ఇంటిముట్టడి కార్యక్రమానికి మలిదశ ఉద్యమకారులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో పోలీసులు ముందస్తుగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Telangana Protest Arrests | ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్పి..

ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ఆదుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) హామీ ఇచ్చి మూడేళ్లు గడిచినా ఇప్పటివరకు తమ ఆశయాలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను జూన్ 2లోపు అమలు చేయాలని, లేనిపక్షంలో తదుపరి కార్యాచరణ మరింత తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉడుత గంగాధర్ గుప్తా, మండల అధ్యక్షుడు గంజివార్ చందు, కాల్వ శ్యామ్, భాస్కర్ గౌడ్, ఎదుబాల్లే కృష్ణ, అగ్లవే దత్తు, గైని గంగారామ్, పల్లికొండ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక: డీఎఫ్​​వో సిద్ధార్థ విక్రమ్​ సింగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

BJP Ticket Scam | ఇందూరు బీజేపీలో కలకలం.. కార్పొరేటర్​ టికెట్​ పేరిట డబ్బులు వసూలు..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: BJP Ticket Scam | ఇందూరు బీజేపీలో ఓ...

Unnao Rape Case| కుల్దీప్ సింగ్ సెంగార్ శిక్షపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Unnao Rape Case|ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిగా తేలిన మాజీ...

Bandi Bhageerath | సాయిభగీరథ్​ను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Bandi Bhageerath | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...