నిజామాబాద్Government Hospital Services | ప్రభుత్వ ఆస్పత్రుల సేవలను వినియోగించుకోవాలి..: ఎమ్మెల్యే ధన్​పాల్​

Government Hospital Services | ప్రభుత్వ ఆస్పత్రుల సేవలను వినియోగించుకోవాలి..: ఎమ్మెల్యే ధన్​పాల్​

ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలను వినియోగించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అప్పుల పాలు కావొద్దన్నారు.

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Government Hospital Services | ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్(MLA Dhanpal) సూర్యనారాయణ సూచించారు. నగరంలోని సుభాష్ నగర్​లో గల ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను(CMRF cheques) పంపిణీ చేశారు.

Government Hospital Services | అప్పుల పాలు కావొద్దు

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాధితులు అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. ప్రభుత్వపరంగా అనేక ఆస్పత్రులు నాణ్యమైన చికిత్సలు అందజేస్తున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్​లో(Nizamabad GGH) వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సరైన చికిత్స అందుకుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Government Hospital Services | బీబీనగర్​లో ఎయిమ్స్​లో..

కేంద్ర ప్రభుత్వం బీబీనగర్​లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్​లో(AIIMS) అత్యాధునిక చికిత్సలను అందజేస్తున్నారని ఎమ్మెల్యే తెలియజేశారు. అలాగే నిమ్స్​లోనూ చికిత్స కోసం ఎల్వోసీ అవసరమైతే తమ వద్దకు రావాలన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కుల బిల్లులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాధితులు దరఖాస్తు చేసుకున్న వాటిలో వారు 60 శాతం పైగా ఇవ్వాలని కోరారు. అనంతరం మొత్తం 97 మందికి రూ.21,43,000 విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మల్లేష్ యాదవ్, మఠం పవన్, ఎర్రం సుధీర్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, బంటు ప్రీతి ప్రవీణ్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Digital Health Cards| ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ నివేదికపై సర్కార్ క్లారిటీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Revanth Reddy Bandi Sanjay | బండి సంజయ్ తన కొడుకును వెంటనే పోలీసులకు అప్పగించాలి: సీఎం రేవంత్ రెడ్డి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Revanth Reddy Bandi Sanjay | కేంద్ర మంత్రి...

NEET Paper Leak | నీట్​ పేపర్​ లీకేజీలో కీలక నిందితుడి అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Paper Leak | నీట్ (NEET...

Telangana Udyamakarula Committee | తెలంగాణ ఉద్యమకారులకు ‘రాజ గౌరవం’.. జర్నలిస్టులకు గుర్తింపు లభించేనా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Udyamakarula Committee | స్వరాష్ట్ర కల సాకారం కోసం...

Nampally Railway Station | నాంపల్లి రైల్వే స్టేషన్​లో అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nampally Railway Station | హైదరాబాద్ (Hyderabad)​...