అక్షరటుడే, ఆర్మూర్ : Paddy Procurement Politics | రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను అడ్డుకునేలా కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) హెచ్చరించారు. ఆలూర్ (Alur) మండల కేంద్రంతో పాటు మిర్దాపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం పరిశీలించారు.
Paddy Procurement Politics | రైతుల పేరుతో రాజకీయాలొద్దు..
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పేరుతో రాజకీయాలు చేస్తూ అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కొనుగోలు కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు సృష్టిస్తూ రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుండగా, కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు తీసుకొచ్చే ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు (Paddy Procurement), మిల్లుల వద్ద లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా మిల్లర్లు తగిన సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Paddy Procurement Politics | కడ్తా.. తరుగు పేరుతో..
కడ్తా, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసే వారిపై కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఎవరైనా రైతులను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమన్నారు. అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ (State Cooperative Union Limited) ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీఎస్వో (DSO) శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లయ్స్ డీఎం ప్రవీణ్, ఎంపీడీవో గంగాధర్, తహశీల్దార్ రమేశ్, సర్పంచ్లు ముక్కెర విజయ్, యల్లా సాయిరెడ్డి, ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వైస్ మల్లారెడ్డి, సీఈవో మల్లేష్, కాంగ్రెస్ నాయకులు నీలగిరి శ్రీను, మహేష్, శివ, శ్రీనివాస్ రెడ్డి, ఉదయ్, గంగారెడ్డి, భాస్కర్, జితేందర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Digital Health Cards| ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ నివేదికపై సర్కార్ క్లారిటీ


