Gig Workers Strike | నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gig Workers Strike | పెరిగిన ఇంధన ధరలు, తక్కువ వేతనాలకు నిరసనగా దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులను బహిష్కరించనున్నారు.

ఇంధన ధరల పెరుగుదల, తక్కువ చెల్లింపులకు నిరసనగా యాప్ ఆధారిత డ్రైవర్లు, డెలివరీ కార్మికులు దేశవ్యాప్త తాత్కాలిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఎక్కువ గంటలు పనిచేస్తున్నప్పటికీ, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల తగినంత సంపాదించడం కష్టంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ మార్కెటింగ్ (Oil Marketing) కంపెనీలు లీటరుకు సుమారు రూ.3 మేర ఇంధన ధరను పెంచడంతో ఈ నిరసన మొదలైంది. తమ రోజులో ఎక్కువ భాగం రోడ్డుపైనే గడిపే క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ కార్మికులకు ఈ తాజా పెంపు వారి రోజువారీ ఆదాయంపై నేరుగా ప్రభావం చూపుతుందని అంచనా.

Gig Workers Strike | ఖర్చులు పెరిగాయి

ఇంధన ధరలు (Fuel Prices) పెరిగిన ప్రతిసారీ మా ఖర్చులు వెంటనే పెరుగుతాయి, కానీ కస్టమర్ల ఛార్జీలు దానికి అనుగుణంగా పెరగవు అని ఓ క్యాబ్​ డ్రైవర్​ పేర్కొన్నారు. కమీషన్, ఇంధన ఛార్జీలు చెల్లించిన తర్వాత తమకు ఏమీ మిగలడం లేదని చెప్పారు. ఇంధనం మళ్లీ ఖరీదైనదిగా మారడంతో తమ సంపాదన తీవ్ర ఒత్తిడికి గురవుతోందని గిగ్ వర్కర్లు చెబుతున్నారు. తమకు కమీషన్​ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Medical Shops Bandh | ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపుల బంద్‌

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *