Trump Warns Iran | ఇరాన్​కు మరోసారి ట్రంప్​ వార్నింగ్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Warns Iran | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump) ఇరాన్​కు మరోసారి వార్నింగ్​ ఇచ్చారు. సోమవారం పాకిస్థాన్​లో రెండు దేశాల మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో తమ ప్రతిపాదనను ఇరాన్​ అంగీకరించకపోతే ఆ దేశంలోని ప్రతి ఒక్క విద్యుత్ ప్లాంటును, వంతెనను పేల్చేస్తామని బెదిరించారు.

ట్రంప్​ ఇటీవల సైతం ఇరాన్​పై పెద్ద ఎత్తున దాడులు చేస్తామని బీరాలు పలికారు. తీరా అర్ధరాత్రి వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇటీవల ఇస్లామాబాద్​లో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. మరోవైపు ఇరాన్​ ఓడ రేవులను అమెరికా దిగ్భందించగా.. హర్ముజ్​ను ఇరాన్ మళ్లీ మూసేసింది. ఈ క్రమంలో ట్రంప్​ ఆదివారం సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తూ ఇరాన్​కు వార్నింగ్​ ఇచ్చారు.

Trump Warns Iran | నౌకలపై కాల్పులు

హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో శనివారం ఇరాన్ నౌకలపై కాల్పులు జరపాలని నిర్ణయించుకుందని ట్రంప్​ అన్నారు. ఇది మన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. తమ ప్రతినిధులు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు వెళ్తున్నారని, వారు చర్చల కోసం రేపు సాయంత్రం అక్కడ ఉంటారన్నారు. తాము చాలా న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్​ దానిని అంగీకరిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. ఒకవేళ వారు అంగీకరించకపోతే, యునైటెడ్ స్టేట్స్ ఇరాన్‌లోని ప్రతి ఒక్క విద్యుత్ ప్లాంటును, వంతెనను నాశనం చేయబోతోందన్నారు.

iran us

Trump Warns Iran | మంచివాడిని కాదు

ఇకపై తాను మంచివాడిని కానని ట్రంప్​ పేర్కొన్నారు. వారు వేగంగా, సులభంగా కూలిపోతారని వార్నింగ్​ ఇచ్చారు. ఒకవేళ వారు ఈ ఒప్పందాన్ని అంగీకరించకపోతే, గత 47 ఏళ్లుగా ఇతర అధ్యక్షులు ఇరాన్‌కు చేసి ఉండాల్సిన పనిని చేయడం నాకు గౌరవంగా ఉంటుందన్నారు. ఇరాన్ హత్యా యంత్రాంగానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్నారు.

ఇది కూడా చదవండి : Bab al-Mandeb Strait | బాబ్ అల్-మండేబ్ జలసంధిని మూసివేస్తాం.. హౌతీల సంచలన ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *