తెలంగాణTelangana Heatwave Alert | దంచికొడుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు 'రెడ్ అలర్ట్'

Telangana Heatwave Alert | దంచికొడుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతుండగా.. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది.

అక్షరటుడే వెబ్‌డెస్క్ : Telangana Heatwave Alert| దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతుండగా.. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగడమే కాకుండా, ప్రమాదకరమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Telangana Heatwave Alert | ఇవాళ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్..

ఎండల తీవ్రత దృష్ట్యా ఇవాళ ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు అధికారులు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును తాకే ప్రమాదం ఉందని తెలిపారు. మరోవైపు, రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఎండలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.

Telangana Heatwave Alert | రేపటి నుంచి మరింత డేంజర్..

సోమవారం (రేపు) నాటికి భానుడి ప్రతాపం మరింత పెరగనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు ఏకంగా ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటవచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రేపటి కోసం ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి:  SIR Process Allegations | కేంద్రం పైసలిస్తున్నా ధాన్యం ఎందుకు కొనట్లేదు? రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ACB Raids HMWSSB GM | జలమండలి జీఎంకు ఏసీబీ షాక్‌.. కుప్పలుగా నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACB Raids HMWSSB GM | భాగ్యనగరంలో అవినీతి...

Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు మరమ్మతులు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో...

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...