క్రైంRIMS Harassment Case | రిమ్స్‌లో పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. నర్సింగ్...

RIMS Harassment Case | రిమ్స్‌లో పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. నర్సింగ్ అధికారి అరెస్ట్

ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) ఆసుపత్రిలో ఒక ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది.

అక్షరటుడే వెబ్‌డెస్క్: RIMS Harassment Case | ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) ఆసుపత్రిలో ఒక ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. తోటి సిబ్బందికి రక్షణగా నిలవాల్సిన ఒక నర్సింగ్ అధికారే, అక్కడ పీజీ చదువుతున్న మహిళా వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

RIMS Harassment Case | ఆపరేషన్ థియేటర్‌లోనే ఘోరం

పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన రిమ్స్ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ (OT)లోనే జరిగింది. సదరు మహిళా డాక్టర్ విధుల్లో భాగంగా అక్కడ ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసుకుని, అదే ఆసుపత్రిలో పనిచేసే ఒక నర్సింగ్ అధికారి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఊహించని ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు.. వెంటనే ఆసుపత్రి ఉన్నతాధికారులకు సమాచారం అందించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఆదిలాబాద్ పోలీసులు ఆసుపత్రిలో ప్రాథమిక విచారణ జరిపారు. ఆధారాలు సేకరించిన అనంతరం నిందితుడైన నర్సింగ్ అధికారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఆసుపత్రి ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతో యాజమాన్యం ఈ విషయాన్ని కొన్ని రోజుల పాటు బయటకు రాకుండా దాచిపెట్టినట్లు తెలుస్తోంది.

RIMS Harassment Case | జూనియర్ డాక్టర్ల నిరసన..

బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ, ఆసుపత్రి ప్రాంగణంలోనే తోటి ఉద్యోగినిపై ఇలా లైంగిక వేధింపులకు పాల్పడటంపై రిమ్స్ వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో మహిళా డాక్టర్లకు, సిబ్బందికి ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. నిందితుడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆసుపత్రిలో భద్రతను కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: Telangana Heatwave Alert | దంచికొడుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

India Italy Cooperation | రోమ్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోడీ.. IMEC కారిడార్‌పై ప్రత్యేక దృష్టి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: India Italy Cooperation | భారతదేశం – ఇటలీ...

Matrimonial fraudster arrested | మెడలో తాళి కడతానని.. అకౌంట్ ఖాళీ చేస్తాడు.. మాట్రిమోని కిలాడీ ‘కామేషు’ వేషాలు మామూలుగా లేవుగా!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Matrimonial fraudster arrested | పెళ్లి పీటలు ఎక్కించి, జీవితాంతం...

ACB Raids HMWSSB GM | జలమండలి జీఎంకు ఏసీబీ షాక్‌.. కుప్పలుగా నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACB Raids HMWSSB GM | భాగ్యనగరంలో అవినీతి...