అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : DElEd Exam Arrangements | డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పరీక్ష (DElEd)కు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు (Exam Security) చేసినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు.
DElEd Exam Arrangements | జిల్లా కేంద్రంలోని మల్లారంలో..
డీఈఐఈడీ పరీక్ష ఈనెల 25వ తేదీ నుంచి 31వరకు నగర శివారులోని మల్లారం డైట్ కళాశాలలో (DIET College), ఖిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగునున్నాయన్నారు. ఈ పరీక్ష కేంద్రం వద్ద 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో పోలీసు సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడం నిషేధమని తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాప్‌లు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని ఆయన సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయబడుతుందన్నారు.
ఇది కూడా చదవండి: RIMS Harassment Case|రిమ్స్‌లో పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. నర్సింగ్ అధికారి అరెస్ట్


