జాతీయంVD Satheesan CM Oath | రేపు కేరళం సీఎం ప్రమాణ స్వీకారం

VD Satheesan CM Oath | రేపు కేరళం సీఎం ప్రమాణ స్వీకారం

కేరళం సీఎంగా సోమవారం వీడీ సతీషన్​ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేస్తారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : VD Satheesan CM Oath | కేరళం (Keralam) సీఎంగా సోమవారం వీడీ సతీషన్​ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేస్తారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ (UDF) కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు పోటీ పడగా.. చివరకు కాంగ్రెస్​ అధిష్టానం సీనియర్​ నాయకుడు వీడీ సతీషన్​ను ఎంపిక చేసింది. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రితో పాటు పూర్తి మంత్రివర్గం ప్రమాణం చేయనున్నట్లు తెలిపారు.

VD Satheesan CM Oath | ముస్లిం లీగ్​కు అవకాశం

యూడీఎఫ్ కూటమిలోని ముస్లిం లీగ్​కు సైతం కాంగ్రెస్​ మంత్రి పదవులు ఇవ్వనుంది. ఇప్పటికే ఆ పార్టీ మంత్రులు కాబోయే అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్​లో సైతం పలువురిని ఎంపిక చేసినట్లు వీడీ సతీషన్​ తెలిపారు. సామాజిక సమీకరణాలు, ఇతర కారణాలతో పలువురు అర్హులైన నాయకులకు కూడా కేబినెట్​లో చోటు కల్పించలేకపోయామన్నారు. అందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. రేపు తనతో పాటు రమేష్ చెన్నితాల, KPCC అధినేత సన్నీ జోసెఫ్, కె. మురళీధరన్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. తిరువంచూర్ రాధాకృష్ణన్ స్పీకర్​గా, షానిమోల్ ఉస్మాన్ డిప్యూటీ స్పీకర్​గా ఉంటారని ఆయన తెలిపారు.

VD Satheesan CM Oath | శాఖల కేటాయింపు పూర్తి

మంత్రులకు శాఖల కేటాయింపు దాదాపుగా ఖరారైందని వీడీ సతీషన్​ తెలిపారు. కొన్ని చిన్నపాటి సవరణలు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ జాబితాను గవర్నర్‌కు సమర్పిస్తామన్నారు. అనంతరం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Rajinikanth Vijay | ఆయన సీఎం అయితే అసూయ పడేవాడిని.. రజనీకాంత్​ సంచలన వ్యాఖ్యలు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు కొనసాగుతున్న మరమ్మతులు..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో...

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...