అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Drunk Driving Checks | హైదరాబాద్ (Hyderabad) నగరంలో పోలీసులు వీకెండ్ సందర్భంగా శుక్రవారం, శనివారం రాత్రి ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1000 మందికి పైగా మందు బాబులు పోలీసులకు చిక్కారు.
హైదరాబాద్‌లో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయి. ఇందులో మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం కారణంగా ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. అయినా మందుబాబులు మాత్రం మారడం లేదు. హైదరాబాద్, సైబరాబాద్ (Cyberabad), మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో 1,000 మందికి పైగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
Hyderabad Drunk Driving Checks | వీకెండ్లో..
నగరంలో వీకెండ్ వచ్చిందంటే ఉద్యోగులు, యువత ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. కొందరు పూటుగా తాగి వాహనాలపై ఇళ్లకు వెళ్తున్నారు. దీంతో పోలీసులు శుక్రవారం, శనివారం రాత్రి ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా జరిపిన దాడుల్లో 1,090 మందికి పైగా వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 474 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికారు. ఇందులో 417 మంది బైకర్లు, 24 మంది త్రిచక్ర వాహనదారులు, 33 మంది కార్లు, ఇతర వాహనాలు నడుపుతున్న వారు ఉన్నారు.
Hyderabad Drunk Driving Checks | సైబరాబాద్‌లో..
సైబరాబాద్ (Cyberabad) ట్రాఫిక్ పోలీసులు వారాంతంలో తనిఖీలు నిర్వహించి, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 300 మందిని పట్టుకున్నారు. ఇందులో 253 మంది ద్విచక్ర వాహనాలు, 9 త్రిచక్ర వాహనాలు, 38 మంది నాలుగు చక్రాల వాహనాలు నడుపుతున్న వారు ఉన్నారు. మల్కాజ్‌గిరిలో 323 కేసులు నమోదు అయ్యాయి. 267 మంది బైకర్లు, 22 మంది త్రిచక్ర వాహనదారులు, 33 నాలుగు చక్రాల వాహన డ్రైవర్లు, ఒక భారీ వాహన డ్రైవర్ పోలీసులకు చిక్కిన వారిలో ఉన్నారు.
దీనిని కూడా చదవండి : Fake Doctor Arrest | ఇంటర్ ఫెయిల్.. డాక్టర్‌గా చెలామణి.. నకిలీ వైద్యుడిని అరెస్ట్ చేసిన పోలీసులు


