Vijay Government Crisis | తమిళనాడు రాజకీయాల్లో వేడి పెంచిన డీఎంకే వ్యాఖ్యలు.. విజయ్ ప్రభుత్వం కూలిపోతుంది, మ‌ళ్లీ స్టాలినే సీఎం..!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Vijay Government Crisis | తమిళనాడు (Tamilnadu) రాజకీయాల్లో తాజా పరిణామాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్ష డీఎంకే దూకుడుగా విమర్శలు గుప్పిస్తోంది.

ఈ నేపథ్యంలో డీఎంకే సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ (MLA Anita Radhakrishnan) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దక్షిణ తమిళనాడులో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, విజయ్ ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని, మరో నాలుగు నుంచి ఆరు నెలలకు మించి నిలబడే పరిస్థితి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. అనంతరం తమ పార్టీ నాయకుడు ఎం.కె. స్టాలిన్ (M.K. Stalin) మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపడతారని ధీమా వ్యక్తం చేశారు.

Vijay Government Crisis | డీఎంకే విమ‌ర్శ‌లు..

గత ఎన్నికల సందర్భంగా జరిగిన రాజకీయ పరిణామాలపై కూడా ఆయన స్పందించారు. స్టాలిన్ తన సొంత నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని పేర్కొంటూ, కొలత్తూర్‌ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లారని అన్నారు. భవిష్యత్తులో స్టాలిన్  మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయని చెప్పారు. అదే కార్యక్రమంలో మంత్రి ఆధవ్ అర్జునకు అనితా రాధాకృష్ణన్ బహిరంగ సవాల్ విసిరారు. తనకు నిజంగా ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, తాను కూడా రాజీనామా చేసి తిరుచెందూర్ నియోజకవర్గం (Tiruchendur Constituency)లో ప్రత్యక్ష పోరుకు సిద్ధమని అన్నారు. తిరుచెందూర్ ప్రాంతం తమ పార్టీకి బలమైన స్థావరమని, అక్కడ ప్రజల మద్దతు తమకే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Vijay Government Crisis | విశ్వాస పరీక్షలో కూడా విజయం

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ పార్టీ (Vijay Party) గణనీయమైన విజయాన్ని నమోదు చేసి, ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విశ్వాస పరీక్షలో కూడా ప్రభుత్వం మెజారిటీతో విజయం సాధించింది. అయినప్పటికీ ప్రభుత్వం అస్థిరంగా ఉందంటూ డీఎంకే విమర్శలు చేస్తుండగా, అధికార పార్టీ మాత్రం ఆ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. ప్రస్తుతం డీఎంకే నేత చేసిన తాజా వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కార్యాలయం లేదా సంబంధిత నాయకులు ఎలా స్పందిస్తారన్న అంశం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

ఇది కూడా చదవండి..: Kerala New CM| కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *