అంతర్జాతీయంTrump Iran Map Post | ఇరాన్​ మ్యాప్​పై అమెరికా జెండా.. సోషల్​ మీడియాలో ట్రంప్​...

Trump Iran Map Post | ఇరాన్​ మ్యాప్​పై అమెరికా జెండా.. సోషల్​ మీడియాలో ట్రంప్​ పోస్ట్​

డోనాల్డ్ ట్రంప్ సోమవారం సోషల్ మీడియాలో పశ్చిమ ఆసియా మ్యాప్​ను షేర్​చేశారు. అందులో ఇరాన్​తో సహా పలు దేశాలపై అమెరికా జెండా ఉంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Trump Iran Map Post | అమెరికా–ఇరాన్​ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నా.. ఉద్రిక్తతలు మాత్రం చల్లారడం లేదు. శాంతి చర్చలు కొలిక్కి రాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

ఈ క్రమంలో ఇరాన్​ను రెచ్చగొట్టేలా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.డొనాల్డ్ ట్రంప్ సోమవారం సోషల్ మీడియాలో పశ్చిమ ఆసియా మ్యాప్​ను షేర్​చేశారు. అందులో అన్ని దేశాలపై అమెరికా జెండా ఉంది. పలు దిశల నుండి ఇరాన్ వైపు ఎర్ర బాణాలను చూపించారు. ఇది వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది.

Trump Iran Map Post | సమయం మించిపోతుంది

సంఘర్షణను ముగించే లక్ష్యంతో అమెరికా తెచ్చిన శాంతి ప్రతిపాదనను ఇరాన్ (Iran) అంగీకరించడానికి “సమయం మించిపోతోంది” అని ట్రంప్ హెచ్చరించిన కొద్దిసేపటికే ఈ పోస్ట్ వచ్చింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి సైనిక చర్యకు దిగవచ్చనే ఊహాగానాలకు కొత్తగా ఆజ్యం పోసింది. ఆదివారం, ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ ద్వారా ఇరాన్‌కు గట్టి సందేశం ఇచ్చారు. వారు వేగంగా కదలడం మంచిది, లేకపోతే వారిదేమీ మిగలదు. సమయం చాలా విలువైనది అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: US Iran Nuclear Talks | అమెరికా–ఇరాన్ అణు చర్చల్లో ఉద్రిక్తత.. కఠిన షరతులతో మళ్లీ పెరుగుతున్న భౌగోళిక ఆందోళనలు

 

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ACB Raids HMWSSB GM | జలమండలి జీఎంకు ఏసీబీ షాక్‌.. కుప్పలుగా నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACB Raids HMWSSB GM | భాగ్యనగరంలో అవినీతి...

Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు మరమ్మతులు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో...

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...