క్రైంPune Lawyer Assault l పూణేలో దారుణం.. కదులుతున్న కారులో లాయర్‌పై అత్యాచారం

Pune Lawyer Assault l పూణేలో దారుణం.. కదులుతున్న కారులో లాయర్‌పై అత్యాచారం

పూణేలో ఒక మహిళా న్యాయవాదిపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం జరిగిన ఘోర ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.

అక్షరటుడే వెబ్‌డెస్క్: Pune Lawyer Assault | పూణేలో ఒక మహిళా న్యాయవాదిపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం జరిగిన ఘోర ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. పాట్నాకు చెందిన బాధితురాలు పూణేలో ఎల్‌ఎల్‌బీ చదివి, ప్రస్తుతం ముంబై హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల వృత్తిపరమైన పనిమీద పూణేకు వచ్చిన ఆమెకు ఎదురైన ఈ దారుణ అనుభవం స్థానికంగా కలకలం రేపింది.

Pune Lawyer Assault l హోటల్​లో పరిచయం

గత ఆదివారం పూణేలో ఉన్న బాధితురాలు, మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తిని కలవడానికి కోరేగావ్ పార్క్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లారు. సాయంత్రం వేళ ఆ వ్యక్తి తనతో పాటు మరో ఇద్దరు మహిళలను తీసుకుని అక్కడకు వచ్చాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ ముగ్గురూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అదే హోటల్‌లో ఆమె మద్యం సేవిస్తున్న సమయంలో, పక్క టేబుల్‌లో కూర్చున్న ఇద్దరు వ్యక్తులతో ఆమెకు మాటలు కలిశాయి. అనంతరం వారంతా కలిసి ఒక పబ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Pune Lawyer Assault l కారులో పైశాచికత్వం..

అందరూ కలిసి కారులో బయలుదేరిన కొద్దిసేపటికే నిందితుల అసలు స్వరూపం బయటపడింది. ప్రయాణంలో ఉండగానే నిందితుల్లో ఒకడు కదులుతున్న కారులోనే ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా, నిందితులు తమ మరికొంతమంది స్నేహితులకు స్పీకర్‌ఫోన్‌లో కాల్ చేసి, సదరు మహిళపై అత్యంత అసభ్యకరమైన కామెంట్లు చేశారు. ఆ సమయంలో కారులో ఉన్న మిగిలిన వారు కూడా వికృత శబ్దాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందారని దర్యాప్తులో తేలింది.

Pune Lawyer Assault | బాధితురాలి ఫిర్యాదు..

ఈ ఘోరం జరిగిన తర్వాత బాధితురాలు ఎలాగోలా ఒక స్థానికుడి సహాయంతో తన స్నేహితుడిని సంప్రదించారు. అనంతరం వారిద్దరూ కలిసి కోరేగావ్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితులపై ఫిర్యాదు చేశారు. ఈ ఘాతుకంపై పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ స్పందిస్తూ.. తాము ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న నాల్గవ నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించామని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Warangal Congress Unity | వరంగల్​ కాంగ్రెస్​లో కీలక పరిణామం.. ఒక్కటైన నేతలు

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Friendly Policing | ఫ్రెండ్లీ పోలీసింగ్​పై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి.. సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Friendly Policing | ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్​...

Khammam CI Harassment | మహిళపై సీఐ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khammam CI Harassment | రక్షణ కల్పించాల్సిన...

Kamareddy Property Tax | భువన్ సర్వేతో బయటపడ్డ కామారెడ్డి ఆస్తిపన్ను బకాయిలు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Property Tax | కామారెడ్డి పురపాలక సంఘంలో...

MP Anil kumar | ఎంపీ అర్వింద్ వడదెబ్బ తగిలి మాట్లాడుతుండు: ఎంపీ అనిల్​కుమార్​ యాదవ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Anil kumar | నిజామాబాద్​ ఎంపీ...