అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandra Garib Nagar Demolition | ముంబై (Mumbai)లోని బాంద్రా ఈస్ట్‌లో అధికారులు భారీగా కూల్చివేతలు చేపట్టారు. పశ్చిమ రైల్వే, ఇతర అధికారులు మంగళవారం కూల్చివేతలు ప్రారంభించారు.
బాంద్రా ఈస్ట్‌లో చాలా మంది అక్రమంగా నివసిస్తున్నారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. చట్టబద్ధంగా నివసిస్తున్న 100 మంది నివాసితులు మినహా, మిగిలిన వారందరూ ఈ చర్యను ఎదుర్కొంటారు. కూల్చివేతల అనంతరం ఆ స్థలాన్ని ముంబై నుండి వచ్చే 50 కొత్త రైళ్లకు సౌకర్యం కల్పించడానికి, బాంద్రా టెర్మినల్ విస్తరణకు ఉపయోగించనున్నారు. బాంద్రా సబర్బన్ స్టేషన్ (Bandra Suburban Station)ను బాంద్రా టెర్మినస్‌కు అనుసంధానించడానికి, సబర్బన్ రైళ్లను వేరు చేయడానికి అదనపు స్థలాన్ని ఉపయోగించుకుంటారు.
Bandra Garib Nagar Demolition | నాలుగు రోజుల పాటు
బాంద్రాలోని గరీబ్ నగర్లో భారీ ఎత్తున కూల్చివేత కార్యక్రమం ప్రారంభమైంది. ఆ ప్రాంతంలోని అనధికారిక నిర్మాణాలను తొలగించడానికి బాంబే హైకోర్టు (Bombay High Court) పశ్చిమ రైల్వేకి అనుమతి ఇచ్చింది. ఈ కూల్చివేతల ప్రక్రియ మే 23 వరకు కొనసాగనుంది. కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య బాంద్రా టెర్మినస్ వద్ద ఉన్న ‘బంగ్లాదేశీ’ ఆక్రమణలను తొలగించినందుకు రైల్వే శాఖకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Petrol Diesel Price Hike | సామాన్యుడిపై మరో వడ్డన: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!


