అక్షరటుడే, వెబ్‌డెస్క్: Supreme Court on Street Dogs | వీధి కుక్కల (Street Dogs) విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కుక్కల విషయంలో ప్రభుత్వాల తీరును ఆక్షేపించింది. వీధుల్లో కుక్కలు కనపడ్డానికి వీల్లేదని.. ప్రమాదకర కుక్కలను సహించవద్దని పేర్కొంది.
వీధికుక్కల విషయంలో ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర పోషించకూడదని.. అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. వీధి కుక్కల తరలింపుపై గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు వంటి ప్రభుత్వ సంస్థల నుంచి వీధి కుక్కలను తొలగించాలని ఆదేశిస్తూ తాను జారీ చేసిన ఉత్తర్వుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. జంతు ప్రేమికులు, సంక్షేమ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించింది.
Supreme Court on Street Dogs | ప్రాథమిక హక్కుల ఉల్లంఘన
దేశంలో కుక్కల బెడద విపరీతంగా ఉంది. ఈ క్రమంలో గతంలో సుప్రీంకోర్టు కుక్కలను తరలించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని పలువురు జంతు ప్రేమికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది.
వీధి కుక్కల విషయంలో తన ఉత్తర్వును పాటించకపోతే పురపాలక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కోర్టు ధిక్కరణకు బాధ్యులవుతారని సుప్రీంకోర్టు పేర్కొంది. వీధి కుక్కల కాటు వల్ల ప్రజలు బాధపడుతున్నప్పుడు ప్రభుత్వం చూస్తు ఉండటం సరికాదని తెలిపింది. ఇది చట్టబద్ధ పాలనకు విరుద్ధమని, పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గౌరవప్రదమైన జీవిత హక్కులో.. కుక్కల నుంచి ఎలాంటి హాని వాటిల్లే ప్రమాదం లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా ఉందని కోర్టు పేర్కొంది.
ఇది కూడా చదవండి..: Bandra Garib Nagar Demolition | బాంద్రాలోని గరీబ్ నగర్లో భారీగా కూల్చివేతలు


