బిజినెస్​Airtel Market Cap | ఎయిర్‌టెల్ పైపైకి.. రెండో అత్యంత విలువైన కంపెనీగా రికార్డ్

Airtel Market Cap | ఎయిర్‌టెల్ పైపైకి.. రెండో అత్యంత విలువైన కంపెనీగా రికార్డ్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఎయిర్‌టెల్ షాక్ ఇచ్చింది. మార్కెట్ క్యాప్ పరంగా దేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Airtel Market Cap | టెలికాం రంగ దిగ్గజ సంస్థ భారతి ఎయిర్‌టెల్ (Bharti Airtel) మరో మైలురాయిని చేరింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 11.90 లక్షల కోట్లకు చేరడం ద్వారా దేశంలోనే రెండో అత్యంత విలువైన కంపెనీగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank)ను వెనక్కి నెట్టింది.

Airtel Market Cap | మార్కెట్ విలువ పరంగా జియో నెట్‌వర్క్

దేశంలో టెలికాం దిగ్గజ కంపెనీల హవా కొనసాగుతోంది. మార్కెట్ విలువ పరంగా జియో నెట్‌వర్క్ (Jio Network) మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 18.06 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుతం మరో టెలికాం రంగ దిగ్గజం సునీల్ మిట్టల్ (Sunil Mittal) నేతృత్వంలోని ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ ను రూ. 11.90 లక్షల కోట్లకు పెంచుకోవడం ద్వారా రెండో స్థానానికి చేరుకుంది. ఇన్నాళ్లూ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (మార్కెట్ క్యాప్ రూ. 11.80 లక్షల కోట్లు) రెండో స్థానంలో ఉండేది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఆ స్థానాన్ని ఆక్రమించింది.

Airtel Market Cap | స్టాక్ పనితీరు..

ఎయిర్‌టెల్ కంపెనీ ఇన్వెస్టర్లకు లాభాలు పంచుతోంది. ఈ కంపెనీ 52 వారాల కనిష్ట ధర రూ. 1,740 కాగా.. 52 వారాల గరిష్ట ధర రూ. 2,174గా ఉంది. గత సెషన్‌లో రూ. 1,938 వద్ద స్థిరపడింది. చివరి నాలుగు సెషన్లలోనే 12 శాతం వరకు ర్యాలీ తీయడం గమనార్హం. కంపెనీ త్రైమాసిక లాభాలు గతేడాదితో పోలిస్తే తగ్గినప్పటికీ భవిష్యత్తులో రాబోయే ఆదాయ వృద్ధిపై ఇన్వెస్టర్లు నమ్మకంతో ఉన్నారు. కస్టమర్ల నుంచి వచ్చే సగటు ఆదాయం (ఆర్పూ) పెరగడం, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల విస్తరణతో స్టాక్ మరిన్ని లాభాలను అందిస్తుందని ఆశిస్తుండడంతో ర్యాలీ కొనసాగుతోంది. అయితే స్వల్పకాలిక లాభాల కోసం చూసేవారు స్టాక్ ప్రస్తుత పనితీరును మాత్రమే పరిగణనలోకి తీసుకుని తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, మార్కెట్ స్థిరత్వాన్ని గమనించడం అవసరమన్న అభిప్రాయం అనలిస్టుల్లో వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి..: Stock Market Gains | లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Friendly Policing | ఫ్రెండ్లీ పోలీసింగ్​పై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Friendly Policing | ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్​...

Khammam CI Harassment | మహిళపై సీఐ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khammam CI Harassment | రక్షణ కల్పించాల్సిన...

Kamareddy Property Tax | భువన్ సర్వేతో బయటపడ్డ కామారెడ్డి ఆస్తిపన్ను బకాయిలు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Property Tax | కామారెడ్డి పురపాలక సంఘంలో...

MP Anil kumar | ఎంపీ అర్వింద్ వడదెబ్బ తగిలి మాట్లాడుతుండు: ఎంపీ అనిల్​కుమార్​ యాదవ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Anil kumar | నిజామాబాద్​ ఎంపీ...