తెలంగాణAssistant Professor Merit List | మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు...

Assistant Professor Merit List | మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 34 డిపార్ట్‌మెంట్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Assistant Professor Merit List | ప్రభుత్వ మెడికల్ కాలేజీ medical college ల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది.

Assistant Professor Merit List | పోస్టుకు ముగ్గురు చొప్పున

ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున (1:3) అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని వెంగల్‌రావు నగర్‌‌లో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌ ప్రాంగణంలో ఈ నెల 22, 23 తేదీల్లో వెరిఫికేషన్ జరగనుంది.

విద్యార్హత, కమ్యునిటీ, తదితర అన్ని సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని బోర్డు పేర్కొంది. ఈ నెల 22, 23వ తేదీల్లో వెరిఫికేషన్‌కు హాజరు కాలేని వారు, ఈ నెల 25వ తేదీన వచ్చి సర్టిఫికెట్లు అందజేయవచ్చునని బోర్డు స్పష్టం చేసింది.

Assistant Professor Merit List | 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 34 డిపార్ట్‌మెంట్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందులో పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ, అనస్తేషియా డిపార్ట్‌మెంట్లలోని 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది. ఆయా పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు ఇటీవలే నియామక పత్రాలు కూడా అందజేశారు.

మిగిలిన 30 డిపార్ట్‌మెంట్లలోని 433 పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను మంగళవారం విడుదల చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం, ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల జాబితాను విడుదల చేస్తామని బోర్డు తెలిపింది.

Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు కొనసాగుతున్న మరమ్మతులు..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో...

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...