Bandi Sanjay Comments|నేను ఎలాంటివాడినో నా పార్టీ కార్యకర్తలకు తెలుసు:బండి సంజయ్

Shivam nagarani

Bandi Sanjay Comments|తాను భారతీయ జనతా పార్టీలో (BJP) ఎల్లప్పుడూ నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేసే ఒక సాధారణ కార్యకర్తనని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ స్పష్టం చేశారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేయడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో స్పందించారు.

Bandi Sanjay Comments|కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చింది మేమే..

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “కేసీఆర్ ఎప్పుడూ తన ఫామ్‌హౌస్‌లోనే కూర్చుని ఏవేవో మాట్లాడుతుంటారు. తెలంగాణలో ఆయన నిర్మించిన అవినీతి సామ్రాజ్యాన్ని ముక్కలు చేసింది మేమే. ఆ కసితోనే ఇప్పుడు మాపై పనిగట్టుకుని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు” అని మండిపడ్డారు.

Bandi Sanjay Comments|కొడుకును పోలీసులకు అప్పగించిన చరిత్ర నాది..

రాజకీయాల్లో తన వ్యక్తిత్వాన్ని శంకించేవారికి సమాధానమిస్తూ బండి సంజయ్ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. “నేను ఎలాంటి వ్యక్తిని, నా క్యారెక్టర్ ఏంటనేది నా పార్టీ కార్యకర్తలకు బాగా తెలుసు. తప్పు చేస్తే సొంత కొడుకునైనా సరే చట్టానికి అప్పగించిన చరిత్ర నాది. విచారణకు పూర్తిగా సహకరించాలనే ఉద్దేశంతో నా కన్నకొడుకును నేనే స్వయంగా పోలీసులకు అప్పగించాను. ఇలాంటి ఉదంతం దేశంలో ఎక్కడైనా ఉందా?” అని ఆయన ప్రశ్నించారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తనపై వస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మరని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Yellareddy Rain Damage | ఈదురు గాలుల బీభత్సంతో నేలకొరిగిన వరి.. తడిసిన ధాన్యం..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *