జాతీయంHDFC Bank | ఆ బ్యాంక్‌కు ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్...

HDFC Bank | ఆ బ్యాంక్‌కు ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోం!

ప్రధాని మోదీ పిలుపు మేరకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చే దిశగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అడుగులు వేస్తోంది. వారానికి రెండు రోజులపాటు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HDFC Bank | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలకు రెక్కలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. దీంతో ఆయా దేశాలు పొదుపు చర్యలు చేపడుతున్నాయి. 85 శాతానికిపైగా క్రూడ్ ఆయిల్‌ను దిగుమతిపై ఆధారపడిన మన దేశంలోనూ పొదుపు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఇటీవల మోడీ వివరించారు.

కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దీనిని అమలు చేసే దిశగా ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ అడుగులు వేస్తోంది. కస్టమర్లతో నేరుగా సంబంధం లేని వ్యాపార, కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన ఉద్యోగులకు వారంలో రెండు రోజులపాటు వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.

HDFC Bank | ఏయే విభాగాలకు వర్తిస్తుందంటే?

ట్రెజరీ ఆపరేషన్స్, ఫైనాన్స్ అకౌంట్స్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ, హెచఆర్ డిపార్ట్‌మెంట్, సాధారణ పరిపాలన సిబ్బందికి ఈ విధానం వర్తిస్తుంది. వినియోగదారులతో లేదా కస్టమర్లతో నేరుగా సంబంధం లేని, కంప్యూటర్ ఆధారిత పనులు చేసే ఉద్యోగులు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కస్టమర్లతో నేరుగా సంబంధం ఉండే ఉద్యోగుల విధులు యథావిధిగా కొనసాగనున్నాయి. వర్క్ ఫ్రం హోం వల్ల వినియోగదారులకు బ్యాంకు సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని బ్యాంకు పేర్కొంది.

HDFC Bank | 30 రోజులు ప్రయోగాత్మకంగా..

వర్క్ ఫ్రమ్ హోంను నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ ముప్పై రోజుల్లో ఉద్యోగుల ఉత్పాదకత, బ్యాంక్ పనితీరు, సేవల నాణ్యతను ఉన్నతాధికారులు నిశితంగా సమీక్షిస్తారు. ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలను ఇస్తే భవిష్యత్తులోనూ కొనసాగించే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి..: Rahul Gandhi Remarks| మోదీ ఒక దేశద్రోహి.. దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారు: రాహుల్ గాంధీ

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Fire Accident | హైదరాబాద్​ నగరంలో గురువారం...

Visakhapatnam Infrastructure Funds|విశాఖలో 3 భారీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అక్షరటుడు వెబ్‌డెస్క్:Visakhapatnam Infrastructure Funds|విశాఖపట్నం(Visakhapatnam) నగరంలో మౌలిక వసతుల ఆధునీకరణ, పట్టణాభివృద్ధి...

Stock Market Gains | లాభాల్లో మార్కెట్లు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Gains | పశ్చిమాసియాలో నాటకీయ పరిణామాలు...

Chandrababu Convoy | సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో కొత్త మార్పులు.. భద్రత కోసం రెండు మినీ బస్సులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu Convoy | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి...