Bowenpally SI bribery case | ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడి నుంచి లంచం డిమాండ్​.. ఏసీబీకి వలలో బోయిన్‌పల్లి మహిళా ఎస్ఐ నందిత!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bowenpally SI bribery case | ప్రేమ పెళ్లి చేసుకున్న ఒక యువకుడికి అండగా నిలిచి.. రక్షణ కల్పించాల్సింది పోయి, అతడినే బెదిరించి లంచం డిమాండ్​ చేసిన బోయిన్‌పల్లి మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) నందిత, ఒక పోలీస్ రైటర్ శనివారం తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. రూ. 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వీరిని పట్టుకున్నారు.

Bowenpally SI bribery case | కేసు వివరాల్లోకి వెళ్తే..

ఒక యువకుడు తన ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో సాయం కోసం బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు.

అయితే, అక్కడి మహిళా ఎస్ఐ నందిత, పోలీస్ రైటర్ అతడికి సాయం చేయడానికి బదులుగా.. అతడిపైనే కేసు నమోదు చేసి జైలుకు కూడా పంపారు.

Bowenpally SI bribery case | బెయిల్ వచ్చినా ఆగని వేధింపులు

బాధిత యువకుడు జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చినా.. పోలీస్ స్టేషన్‌లో అటెండెన్స్ వేసే క్రమంలో ఎస్ఐ, రైటర్ కలిసి డబ్బుల కోసం వేధింపులకు గురిచేశారు.

స్కూటర్ డిక్కీలో లంచం డబ్బులు..

పోలీసుల వేధింపులు తట్టుకోలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అనిశా అధికారుల వ్యూహం ప్రకారం.. ఎస్ఐ నందిత సూచనల మేరకు బాధితుడు రూ. 30,000 నగదును ఆమె స్కూటర్ డిక్కీలో ఉంచాడు.

సరిగ్గా అదే సమయంలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐ నందితను, రైటర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Crude oil prices | ఆయిల్ ధరలు పడిపోతాయ్: అమెరికా అధ్యక్షుడు…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *