Caught by ACB | ఇంటి మ్యుటేషన్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన వార్డు ఆఫీసర్​

ఇంటి మ్యుటేషన్​ కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటూ వార్డు ఆఫీసర్​ ఏసీబీకి చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Caught by ACB | మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ఇంటి మ్యుటేషన్​ కోసం లంచం తీసుకుంటుండగా.. అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

కుత్బుల్లాపూర్​లోని ఎల్లంపేట మున్సిపల్ (Yellampet Municipal) కార్యాలయంలో వార్డు అధికారిగా డి రవీందర్​ రెడ్డి పని చేస్తున్నాడు. ఓ వ్యక్తి తన పూర్వికుల ఇంటిని అతడి తండ్రి పేరు మీద నుంచి తన పేరుపై మార్చాలని వార్డు ఆఫీసర్​ను కలిశాడు. ఈ మేరకు పత్రాలు సమర్పించాడు. అయితే రూ.40 వేలు ఇస్తేనే మ్యుటేషన్​ చేస్తానని వార్డు ఆఫీసర్​ రవీందర్​ రెడ్డి చెప్పాడు. అనంతరం బతిమిలాడటంతో ఆ మొత్తాన్ని రూ.30 వేలకు తగ్గించాడు. ఈ విషయమై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.30 వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వార్డు ఆఫీసర్​ రవీందర్​రెడ్డిని రెడ్ హ్యాండెడ్​గ పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్​ చేశారు.

Caught by ACB | చర్యలు లేకపోవడంతో..

ఇటీవల ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ప్రజల్లో సైతం అవగాహన రావడంతో లంచాలు అడిగిన వారిపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో నిత్యం ఏదో ఒక చోట అధికారులు లంచాలు తీసుకుంటూ దొరుకుతున్నారు. అయినా మిగతా అవినీతి అధికారులు భయపడటం లేదు. లంచాలు తీసుకోవడం ఆపడం లేదు. ఏసీబీకి చిక్కుతున్నా.. తర్వాత కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అవినీతి అధికారులు భయపడటం లేదు. కొంతకాలం సస్పెన్షన్​ తర్వాత తిరిగి విధుల్లోకి వస్తామనే ధీమాతో వారు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్​లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి : Stock Market Rally | గ్లోబల్ మార్కెట్లలో సెల్లాఫ్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *