ATM Fraud Arrest | ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నిందితుడి అరెస్ట్

ఏటీఎం కేంద్రాల వద్ద అమాయకులను లక్ష్యంగా చేసుకుని కార్డులు మార్చి, పిన్ నంబర్లు తెలుసుకుని నగదు అపహరిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: ATM Fraud Arrest | ఏటీఎం కేంద్రాల వద్ద అమాయకులను లక్ష్యంగా చేసుకుని కార్డులు మార్చి, పిన్ నంబర్లు తెలుసుకుని నగదు అపహరిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కామారెడ్డి(Kamareddy) డీఎస్పీ మధుసూదన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

ATM Fraud Arrest | భిక్కనూరు మండలం జంగంపల్లి..

భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది రమేష్ రాజంపేటలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద మహిళను బెదిరించి కార్డు లాక్కొని రూ.17 వేలు డ్రా చేయడంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టగా నిందితుడి మోసాలు బయటపడ్డాయి. నిందితుడు ఏటీఎంలో సహాయం చేస్తానని నమ్మించి పిన్ తెలుసుకుని, అసలు కార్డును మరో కార్డుతో మార్చి నగదు డ్రా చేసేవాడు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో నిద్రిస్తున్న వారి పర్సుల నుంచి కూడా కార్డులు దొంగిలించేవాడు. నిజామాబాద్, ఆర్మూర్, నర్సాపూర్, సంగారెడ్డి, మెదక్ తదితర ప్రాంతాల్లోనూ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుడు గతంలోనూ పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు డిఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.5,860 నగదు, 6 ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు, మాస్క్, దొంగిలించిన హీరో గ్లామర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: సాగర్ లో ఏపీ సొరంగ పనులపై.. 9నెలలు మౌనం.. ఇప్పుడు ఆపుతారంట..!! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *