Lake Restoration | మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు

ప్ర‌గ‌తిన‌గ‌ర్లోని అంబీర్ చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ ప్రారంభించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lake Restoration | హైదరాబాద్​ నగరంలో చెరువుల పునరుద్ధరణకు హైడ్రా కృషి చేస్తోంది. ఇప్పటికే పలు చెరువులను పునరుద్ధరించి, ప్రారంభించిన హైడ్రా.. ఇటీవల జీడిమెట్ల ఫాక్స్​ సాగర్ చెరువులో పూడికతీత పనులను ప్రారంభించింది. తాజాగా ప్ర‌గ‌తిన‌గ‌ర్లోని అంబీర్ చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ ప్రారంభించారు.

అంబీర్​ చెరువును ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దుతామని రంగనాథ్​ తెలిపారు. చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌తో పాటు, పూడిక‌ను తొల‌గిస్తామన్నారు. ఈ చెరువు విస్తీర్ణం 162 ఎక‌రాలు కాగా.. ప్ర‌స్తుతం 121.2 ఎక‌రాల‌కే ప‌రిమిత‌మైంద‌న్నారు. అవ‌కాశం ఉన్న మేర‌కు ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి దీనిని 135.8 ఎక‌రాల‌కు విస్తారిస్తామని వెల్లడించారు. చెరువు చుట్టూ బండ్ ఏర్పాటుతో పాటు.. వాకింగ్ ట్రాక్‌లు, పిల్ల‌ల ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా మారుస్తామన్నారు.

Lake Restoration | బోటింగ్​ ఏర్పాటు

చెరువు మ‌ధ్యలో ఉన్న కొండల వద్ద సాహ‌స క్రీడ‌ల‌కు ఆస్కారం కల్పిస్తామని హైడ్రా కమిషనర్​ తెలిపారు బోటింగ్ జెట్టీల‌ను ఏర్పాటు చేసి బోటు షికారును, వాట‌ర్ స్పోర్ట్స్ అందుబాటులోకి తెస్తామ‌న్నారు. భూగ‌ర్భ జ‌లాలు పెంపొందించే విధంగా చెరువును అభివృద్ధి చేస్తామ‌న్నారు. ప్ర‌గ‌తిన‌గ‌ర్‌కు వెళ్లే రహ‌దారికి ఇరువైపులా ఉన్న చెరువును ముందుగా ఒక‌వైపు అభివృద్ధి చేసి.. త‌ర్వాత మ‌రో వైపు చేస్తామ‌న్నారు.

దీనిని కూడా చదవండి : Caught by ACB | ఇంటి మ్యుటేషన్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన వార్డు ఆఫీసర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *