BC Declaration Implementation | బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోతే లక్ష మందితో బీసీ గర్జన

నెలరోజుల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోతే లక్ష మందితో కామారెడ్డిలో బీసీగర్జన నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: BC Declaration Implementation | నెలరోజుల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోతే లక్ష మందితో కామారెడ్డిలో(Kamareddy) బీసీగర్జన నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలో ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

BC Declaration Implementation | రూ.లక్ష కోట్లు ఇస్తామని చెప్పి..

ప్రతి ఆర్థిక సంవత్సరం బీసీల సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించి ఐదేళ్లకుగాను లక్ష కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అలాగే బీసీ సబ్ ప్లాన్​కు చట్టబద్ధత కల్పిస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టర్లలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ప్రభుత్వ పదవులు, నామినేటెడ్, మంత్రివర్గంలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తిచేసుకున్న నేటి వరకు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉన్నందున రాష్ట్ర మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంతో సహా 8 మంది బీసీలకు మంత్రులుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

60శాతం వాటా కల్పించాలని డిమాండ్​..

అలాగే నామినేటెడ్ పోస్టులు, ఐఏఎస్, ఐపీఎస్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్టుల్లో బీసీలకు తెలంగాణలో జరిగిన బీసీ కులగణన లెక్కల ప్రకారం 60శాతం వాటా కల్పించాలని జాజాల శ్రీనివాస్​ డిమాండ్ చేశారు. జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించి బీసీ కులాల లెక్కలు తీయాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో బీసీల జనభేరీ సభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, సాప శివరాములు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మనిమంజరి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సంధ్యారాణి, మహిళా అధ్యక్షురాలు లలిత, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట స్వామి, కొత్తపల్లి మల్లన్న, రాజయ్య, మోహనా చారి, యాదగిరి, ఎల్లయ్య, నర్సింలు, సంజీవ్, వెంకట్, రాజ నర్సింలు, విగ్నేష్, ప్రతాప్, శివమణి, బాలరాజు, శ్రీనివాస్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఎస్ఈపై వేటుతో సరి…!మరోసారి డైవర్షన్ ప్రయత్నమా..? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *