తెలంగాణDeputy Collector Sharmila | అసలే అవినీతి ఆరోపణలు.. ఆపై సర్కారు ఆదేశాల ఉల్లంఘన.. డిప్యూటీ...

Deputy Collector Sharmila | అసలే అవినీతి ఆరోపణలు.. ఆపై సర్కారు ఆదేశాల ఉల్లంఘన.. డిప్యూటీ కలెక్టర్ షర్మిలపై సస్పెన్షన్ వేటు!

బదిలీ ఆదేశాలు వచ్చి రెండు వారాలు అవుతున్నా.. షర్మిల ఉట్నూరులో విధులకు హాజరుకాలేదు. అత్యంత కీలకమైన ఎన్నికల – రెవెన్యూ విధులను నిర్లక్ష్యం చేయడం, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించిన సర్కారు...

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Deputy Collector Sharmila | ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, బదిలీ అయిన స్థానంలో విధుల్లో చేరని హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) డిప్యూటీ కలెక్టర్ ఎం. షర్మిలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆమెను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Deputy Collector Sharmila | పూర్తి వివరాల్లోకి వెళ్తే…

అవినీతి ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ ఎం. షర్మిలను HMDA నుంచి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO)గా బదిలీ చేస్తూ ఈ నెల 4వ తేదీన (G.O.Rt.No.240) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉట్నూరు ఆర్‌డీఓ పదవిని ‘ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్’గా కూడా ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం జిల్లాలో ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (Special Intensive Revision – SIR) మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఈ పోస్టింగ్ అత్యంత కీలకమైనదిగా మారింది.

Deputy Collector Sharmila | ఆదేశాల ఉల్లంఘన

అయితే, బదిలీ ఆదేశాలు వచ్చి రెండు వారాలు అవుతున్నా.. షర్మిల ఉట్నూరులో విధులకు హాజరుకాలేదు. అత్యంత కీలకమైన ఎన్నికల – రెవెన్యూ విధులను నిర్లక్ష్యం చేయడం, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించిన సర్కారు… TCS (CC&A) రూల్స్, 1991 లోని రూల్ 8 ప్రకారం ఆమెను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎం. షర్మిలను సస్పెన్షన్‌లో ఉంచుతున్నట్లు సర్కారు పేర్కొంది.

సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా ఆమెను హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని స్పష్టం చేసింది.

నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కాలంలో ఆమెకు జీవనభృతి (Subsistence Allowance) చెల్లించబడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ డి.ఎస్. గవర్నర్ పేరిట అధికారిక ఉత్తర్వులు (G.O.Rt.No.266) జారీ చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రతులను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA), రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO), ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు తదుపరి చర్యల నిమిత్తం పంపించారు.

Euphoria | ‘యుఫోరియా’: సుఖ భ్రమల్లో యువత.. కన్నీటిలో మునిగిన సమాజం!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Fire Accident | హైదరాబాద్​ నగరంలో గురువారం...

Visakhapatnam Infrastructure Funds|విశాఖలో 3 భారీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అక్షరటుడు వెబ్‌డెస్క్:Visakhapatnam Infrastructure Funds|విశాఖపట్నం(Visakhapatnam) నగరంలో మౌలిక వసతుల ఆధునీకరణ, పట్టణాభివృద్ధి...

Stock Market Gains | లాభాల్లో మార్కెట్లు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Gains | పశ్చిమాసియాలో నాటకీయ పరిణామాలు...

Chandrababu Convoy | సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో కొత్త మార్పులు.. భద్రత కోసం రెండు మినీ బస్సులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu Convoy | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి...