అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rupee Fall | అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యాక అవలంబించిన ఆర్థిక విధానాలు, ఎడాపెడ విధించిన టారిఫ్‌లతో మన దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఎగుమతులు భారమై ద్రవ్యలోటు పెరిగిపోయింది.
అనంతరం పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలకు రెక్కలొచ్చి, మన ఆర్థిక వ్యవస్థపై మరింత భారం మోపింది. ఇదే సమయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండడంతో రూపాయిపై మరింత ప్రభావం పడుతోంది. గత సెషన్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.96 కు పడిపోయింది.
Rupee Fall | కేంద్ర బ్యాంక్ ఏ నిర్ణయం తీసుకుంటుంది?
రూపాయి విలువ రోజురోజుకు పతనమవుతుండడంతో కేంద్ర బ్యాంక్ రంగంలోకి దిగుతోంది. పతనం ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్న ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI Governor Sanjay Malhotra) ఉన్నతాధికారులతో అత్యవసర అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. రూపాయి పతనాన్ని ఆపడానికి మార్కెట్‌లో డాలర్లను విక్రయించడం మాత్రమే సరిపోదని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వడ్డీ రేట్ల పెంపు, ఎనఆరఐ డిపాజిట్ల సేకరణ, కరెన్సీ స్వాప్స్ వంటి చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Rupee Fall | వచ్చేనెలలో ఎంపీసీ మీటింగ్..
అమెరికా, భారత్ మధ్య వడ్డీ రేట్ల వ్యత్యాసం దశాబ్ద కాలంలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత బాండ్ మార్కెట్ నుంచి నిధులను ఉపసంహరిస్తున్నారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచితే వ్యత్యాసం పెరిగి తిరిగి డాలర్ల ప్రవాహం పుంజుకుంటుందన్న అభిప్రాయం అనలిస్టుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల 5వ తేదీన ప్రారంభమయ్యే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. అయితే ఆ సమావేశం కన్నా ముందే వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారమÖ జరుగుతోంది. వడ్డీ రేట్లను పెంచితే రూపాయి విలువ స్థిరపడినా.. రుణ ఖాతాదారులపై నేరుగా భారం పడనుంది. హోమ్ లోన్, కార్ లోన్ ఈఎంఐలు ప్రియమవనున్నాయి.
ఇది కూడా చదవండి..: FBI Scam Network | అమెరికా వృద్ధులకు భారత్ స్కామర్ల టోకరా.. గుట్టురట్టు చేసిన FBI


