అక్షరటుడే, వెబ్‌డెస్క్: May 22 Market Analysis | అమెరికా – ఇరాన్ ల మధ్య శాంతి చర్చలపై ఆశావాదానికి తోడు క్రూడ్ ఆయిల్ ధర కాస్త దిగిరావడంతో గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్ గా స్పందిస్తున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసింది. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం లాభాల బాటలో పయనిస్తున్నాయి.
May 22 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.09 శాతం, ఎస్ అండ్ పీ 0.17 శాతం పెరిగాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.28 శాతం లాభంతో ఉంది.
May 22 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.11 శాతం పెరగ్గా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.39 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.53 శాతం నష్టపోయాయి.
May 22 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 2.32 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.56 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.58 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.18 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.13 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.02 శాతం లాభాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.55 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా 3వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,891 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు 4వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,492 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.24 నుంచి 1 కు పడిపోయింది.
- విక్స్ 3.35 శాతం తగ్గి 17.82 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 104.65 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 64 పైసలు బలపడి 96.19 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.26 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.58 వద్ద ఉన్నాయి.
Telugu States Summer | పల్నాడులో 48.1 డిగ్రీలు.. బయ్యారంలో 46.20…


