Heera Group MD Arrest | హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heera Group MD Arrest | హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌ను ఈడీ అధికారులు (ED Officers) ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హర్యానాలోని గుర్గావ్‌లో తల దాచుకున్న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను గుర్గావ్ నుంచి హైదరాబాద్‌కు తరలించనున్నారు.

నౌహీరా షేక్​ హీరా గ్రూప్​ పేరిట ప్రజలను మోసం చేసింది. ఏడాదికి 36 శాతం లాభాలు ఇస్తామని చెప్పి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఇలా మొత్తం రూ.5,978 కోట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు హీరా గ్రూప్​ ఎండీపై కేసు నమోదు అయింది. అయితే ఇందులో మనీ లాండరింగ్​ (Money Laundering) జరిగినట్లు ఈడీ గుర్తించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ రూ.400 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్​ చేసింది.

Heera Group MD Arrest | బెయిల్​ రద్దు చేయడంతో..

షేక్​ నౌహీరాకు గతంలో సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్​ ఇచ్చింది. అనంతరం దానిని రద్దు చేసింది. వెంటనే సరెండర్​ కావాలని ఆదేశించింది. దీంతో ఈడీ అధికారులు ఆమెపై నాన్​ బెయిలబుల్ వారెంట్​ జారీ చేశారు. అప్పటి నుంచి నిందితురాలు పరారీలో ఉంది. తాజాగా ఈడీ అధికారులు టెక్నికల్​ ఎవిడెన్స్​తో ఆమెను హర్యానాలో అదుపులోకి తీసుకున్నారు.

Heera Group MD Arrest | నకిలీ ఆధార్​ కార్డుతో..

తనపై జారీ అయిన నాన్​ బెయిలబుల్ వారెంట్​పై స్టే ఇవ్వాలని నౌహీరా హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. న్యాయస్థానం ఆ పిటిషన్​ను కొట్టివేసింది. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు ఆమె పిటిషన్​ను కోర్టు కొట్టివేయడంతో ఈడీ అధికారులు.. సాంకేతిక ఆధారాల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. నౌహీరా షేక్ గుర్గావ్‌లో నకిలీ ఆధార్ కార్డ్, తప్పుడు వివరాలతో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. శుక్రవారం ఆమెను హైదరాబాద్​కు తీసుకురానున్నారు.

ఇది కూడా చదవండి..: Cockroach Janata Party viral | ‘బొద్దింక’ రాజ్యం: ఎక్స్ అకౌంట్ ఊడినా.. ఆగని జెన్-జీ ‘కాక్రోచ్’ వీరంగం.. ప్రతిపక్షాల ‘కీటక’ ప్రేమాంజలి!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *