Rajya Sabha Elections | రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajya Sabha Elections | రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల అయింది. ఎన్నికల సంఘం (Election Commission) జూన్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.

రాజ్యసభ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడులలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), కర్ణాటకకు చెందిన మాజీ ప్రధాని దేవెగౌడతో సహా, ప్రస్తుతం ఆ స్థానాల్లో కొనసాగుతున్న సభ్యుల పదవీకాలం జూన్, జూలై నెలల్లో ముగియనుంది. మొత్తం 24 స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

Rajya Sabha Elections | ఏపీలో నాలుగు స్థానాలు

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు, గుజరాత్‌లో ఐదు, జార్ఖండ్‌లో రెండు, మధ్యప్రదేశ్‌లో మూడు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో ఒక్కోటి చొప్పున, కర్ణాటకలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Rajya Sabha Elections | జూన్​ 18న పోలింగ్​

రాజ్యసభ ఎన్నికల కోసం జూన్ 1 నుంచి 8 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 18న సంబంధిత రాష్ట్ర శాసనసభల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యసభ ఎన్నికలు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించి నిర్వహిస్తారు.

ఇది కూడా చదవండి..: Heera Group MD Arrest | హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *