అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Blood Donation Camp | తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా రోగుల కోసం హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
Blood Donation Camp | రక్తదానం ప్రాణదానం
ట్రెసా, హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు రమణ్‌రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానమన్నారు. ఎండాకాలంలో తీవ్రమైన రక్త కొరత ఏర్పడుతుందని, రెడ్‌క్రాస్ (Red Cross)లో తలసేమియా రోగులకు కొరత రావొద్దనే ఉద్దేశంతో ట్రెసా, హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చి రక్తదానం చేయడం హర్షణీయమన్నారు. 80మంది వరకు జీపీవోలు రక్తదానం చేశారన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి తోట రాజశేఖర్, ట్రెసా, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సభ్యులు, జీపీవోలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Profitable Crops Awareness | రైతులకు లాభసాటి పంటలపై అవగాహన కల్పించాలి : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం


