క్రైంRTC Bus Accident | ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న బస్సు.. తప్పిన పెనుప్రమాదం

RTC Bus Accident | ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న బస్సు.. తప్పిన పెనుప్రమాదం

రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎంను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటన భిక్కనూరు మండలం బస్వాపూర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

అక్షరటుడే, కామారెడ్డి: RTC Bus Accident | రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎంను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటన భిక్కనూరు (Bhiknoor) మండలం బస్వాపూర్ జాతీయ రహదారిపై (Baswapur Highway) శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

RTC Bus Accident | బస్వాపూర్​ జాతీయ రహదారిపై..

పోలీసుల కథనం ప్రకారం.. బస్వాపూర్ జాతీయ రహదారిపై మహారాష్ట్రకు (Maharashtra) చెందిన డీసీఎం వ్యాన్​ ఆగి ఉంది. తెల్లవారుజామున ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆదిలాబాద్(adilabad) నుంచి హైదరాబాద్(Hyderabad) వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న డీసీఎం వ్యాన్​ను వెనకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు ఎడమవైపు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. గాడ నిద్రలో ఉన్న ప్రయాణికులు ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: RBI Dividend Transfer| ఆర్థిక రికార్డులు బద్దలు..కేంద్ర ప్రభుత్వానికి రూ. 2.87 లక్షల కోట్లు ఇవ్వనున్న ఆర్‌బీఐ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mopal Police Arrest | ఉద్యోగులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడి అరెస్టు

అక్షరటుడే, డిచ్​పల్లి(మోపాల్): Mopal Police Arrest | నిజామాబాద్​ జిల్లా మోపాల్...

Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో నివురుగప్పిన నిప్పులా ‘మాఫియా’ వివాదం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jukkal MLA Comments | తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు...

SRH vs RCB | IPL 2026: హైదరాబాద్ భారీ లక్ష్యం.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ కీలక వికెట్లు డౌన్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH vs RCB | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో...