అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana New Pensions | రాష్ట్రంలో పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి సీతక్క (Minister Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ములుగు (Mulugu) జిల్లా స్థాయి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడారు.
రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ హయాంలో పింఛన్లు ఇచ్చారు. దీంతో చాలా మంది పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు కొత్త పెన్షన్ల కోసం కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. సంక్షేమ పథకాలకు అర్హుల జాబితా వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు.
Telangana New Pensions | పలు పథకాల అమలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి పలు పథకాలు అమలు చేయనున్నట్లు సీతక్క తెలిపారు. కొత్త పింఛన్లతో పాటు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నరకం వడ్లకు బోనస్ తదితర పథకాల గురించి వివరించారు.
Telangana New Pensions | విద్యార్థులకు అల్పాహారం
ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేస్తామని సీతక్క తెలిపారు. ఇందులో భాగంగా ఒక రోజు రాగి జావ, మరుసటి రోజు వేడి పాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు పారదర్శకతతో పథకాలను అమలు చేయాలని మంత్రి సూచించారు. లబ్ధిదారుల జాబితాను పథకాల వారీగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్ప చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తుందని ఇప్ప పువ్వు తో అనేక లాభాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
దీనిని కూడా చదవండి : ACB Raids on Deputy Collector | డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు


