అక్షరటుడే, వెబ్డెస్క్: Petrol Diesel Price Hike | సామాన్యుడిపై ఇంధన భారం మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. వరుసగా ఇంధన ధరల పెంపుతో వాహనదారులపై తీవ్రంగా భారం పడుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్ Petrol, డీజిల్ diesel ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Petrol Diesel Price Hike | తాజా పెంపు ఇలా..
- పెట్రోల్: లీటరుకు 87 పైసలు పెంపు
- డీజిల్: లీటరుకు 91 పైసలు పెంపు
Petrol Diesel Price Hike | రెండు వారాల్లోనే మూడోసారి..!
ఈ తాజా పెంపుతో గడిచిన కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
వరుసగా పెరుగుతున్న ధరలతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల్లోనే మూడుసార్లు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు మరింత భారం అయ్యాయి.
దీని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్థానిక పన్నులు, వ్యాట్ (VAT) ఆధారంగా ఆయా రాష్ట్రాలు, నగరాల్లో ఈ ధరల మార్పుల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.
వరుస వడ్డనలతో సతమతమవుతున్న సామాన్యుడు.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పన్నులు తగ్గించడం ద్వారా ఊరట నివ్వాలని కోరుతున్నాడు.


