అక్షరటుడే వెబ్‌డెస్క్: AI Quality Engineering | ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం అన్ని రంగాల్లోనూ విపరీతంగా పెరిగిపోతోంది. ట్రస్ట్-ఫస్ట్, ఏఐ-ఆధారిత క్వాలిటీ ఇంజనీరింగ్ సంస్థ ‘క్వాలిజీల్’ , ప్రముఖ అంతర్జాతీయ పరిశోధన సంస్థ ‘హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్’ సంయుక్తంగా నిర్వహించిన ‘హెచ్ఎఫ్ఎస్ టేక్ 5 x క్వాలిజీల్’ పరిశోధనా అధ్యయనం ప్రకారం.. దాదాపు 57% సంస్థలు ఏదో ఒక రూపంలో జనరేటివ్ ఏఐని ఉత్పత్తి స్థాయిలో (Production Level) వినియోగిస్తుండగా, మరో 36% సంస్థల్లో ఏజెంటిక్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఏఐ స్వీకరణ వేగానికి తగినట్లుగా దాని నాణ్యతకు భరోసా కల్పించే వ్యవస్థల అభివృద్ధి మాత్రం వెనుకబడి ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.
AI Quality Engineering | త్యేక విధానాలు లేకపోవడం ..
అమెరికాలోని ( US )వివిధ సంస్థలకు చెందిన 101 మంది క్వాలిటీ, టెక్నాలజీ లీడర్లపై జరిపిన ఈ అధ్యయనంలో పలు ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. ప్రొడక్షన్లో ఏఐని ఉపయోగిస్తున్నప్పటికీ, కేవలం 15% సంస్థలు మాత్రమే ఏఐ పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించిన విధానాన్ని కలిగి ఉన్నాయి. మిగతా 52% సంస్థలు పాత డిటర్మినిస్టిక్ సాఫ్ట్వేర్ ఫ్రేమ్‌వర్క్‌ల ద్వారానే ప్రాబబిలిస్టిక్ ఏఐ సిస్టమ్స్‌ను పరీక్షిస్తున్నాయి. అంతేకాకుండా, ఉత్పత్తి స్థాయిలో ఏఐని వినియోగిస్తున్న సంస్థల్లో ఏకంగా 37% సంస్థల్లో దాని నాణ్యతకు బాధ్యత వహించే ప్రత్యేక విభాగం (Dedicated Department) ఏదీ లేకపోవడం గమనార్హం.
AI Quality Engineering | నియంత్రణ సమ్మతి..
ఈ అధ్యయనం ప్రకారం సంస్థలు ఏఐ మోడల్ కచ్చితత్వాన్ని (88%) కొలుస్తున్నప్పటికీ, అత్యంత కీలకమైన ఇతర అంశాల్లో వెనుకబడి ఉన్నాయి. కేవలం 47% సంస్థలు మాత్రమే నిష్పాక్షికతను, 37% సంస్థలు వివరణాత్మకతను, , 35% సంస్థలు మాత్రమే నియంత్రణ సమ్మతికి సంబంధించిన సాక్ష్యాలను అందిస్తున్నాయి. “చాలా సంస్థలు తమ ఏఐ కచ్చితమైనదని నిరూపించగలవు, కానీ అది నిష్పక్షపాతంగా, వివరించదగినదిగా ఉందని చాలా తక్కువ సంస్థలు మాత్రమే నిరూపించగలవు” అని హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ ప్రాక్టీస్ లీడర్ హన్సా అయ్యంగార్ పేర్కొన్నారు.
AI Quality Engineering | వనరుల కొరత సమస్య..
సంస్థల వ్యవస్థల్లో ఏఐ అంతర్భాగంగా మారడంతో, ఏఐ మేధస్సుకు కూడా నాణ్యతా భరోసా కల్పించాల్సిన బాధ్యత క్వాలిటీ ఇంజనీర్లపై పడిందని క్వాలిజీల్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ మూర్తి తెలిపారు. రాబోయే రోజుల్లో క్వాలిటీ ఇంజనీర్ల పాత్ర గణనీయంగా మారుతుందని 82% సంస్థలు ఆశిస్తున్నాయి. అయితే, క్యూఈ రంగానికి తగిన బడ్జెట్ లేకుండానే బాధ్యతలు అప్పగించబడుతున్నాయని, కేవలం 24% సంస్థలు మాత్రమే ఈ విస్తరించిన బాధ్యతలకు అనుగుణంగా తగిన వనరులు కేటాయిస్తున్నట్లు అధ్యయనం నివేదించింది.
AI Quality Engineering | సంస్థల భవిష్యత్తు ప్రణాళికలు..
ఏఐ మరింత స్వయంప్రతిపత్తి గలదిగా, వ్యాపారానికి అత్యంత కీలకమైనదిగా మారుతున్న కొద్దీ.. సంప్రదాయ క్యూఈ (క్వాలిటీ ఎవాల్యుయేషన్) నుండి ‘ట్రస్ట్ ఇంజనీరింగ్’ వైపు మార్పు జరుగుతోందని ఈ నివేదిక సూచిస్తోంది. సంస్థలు ఏఐని ఉత్పత్తి దశలోకి తీసుకురావడంలో చూపిన వేగంతో పోలిస్తే, దానిని నియంత్రించే క్రమశిక్షణను అభివృద్ధి చేసుకోవడంలో అంత వేగాన్ని ప్రదర్శించలేదని క్వాలిజీల్ సీఈఓ కళ్యాణ్ కొండా అభిప్రాయపడ్డారు. ఈ అంతరాన్ని పూడ్చేందుకు క్వాలిజీల్ సంస్థ QMentisAI, ValidAIteలతో కూడిన ప్రత్యేక ఏఐ ఎకోసిస్టమ్‌ను రూపొందించింది.
ఇది కూడా చదవండి: Hyderabad Water Supply | తాగునీటి కొరత రాకుండా జలమండలి చర్యలు