అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కొనసాగుతున్న పనులను జలమండలి (HMWSSB) ఎండీ అశోక్‌రెడ్డి, అధికారులు బుధవారం పరిశీలించారు.
ఎల్‌నినో నేపథ్యంలో వర్షాలు లేక నగరానికి నీరు సరఫరా చేసే జలాశయాల్లో నీటినిల్వలు భారీగా తగ్గిపోయాయి. మరోవైపు భూగర్భ జలాలు పడిపోయాయి. దీంతో జలమండలి ట్యాంకర్లకు ఇప్పుడే డిమాండ్ పెరిగింది. వేసవిలో నీటి కొరత తీవ్రం కానుంది. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు ప్రత్యామ్నాయ నీటి తరలింపు కోసం పనులు చేపడుతున్నారు. నగరానికి ప్రధాన జలవనరులైన సింగూరు-మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో ఇతర మార్గాల ద్వారా నీరు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Hyderabad Water Supply | గండిపేట చెరువు పరీశీలన
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బుధవారం గండిపేట చెరువు (ఉస్మాన్‌సాగర్), హిమాయత్సాగర్లను పరిశీలించారు. నగరానికి అదనపు తాగునీటిని సరఫరా చేసే సాధ్యాసాధ్యాలపై ఆరా తీశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో తాగునీటి అవసరాలు పెరుగుతాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జంట జలాశయాల నుంచి అదనంగా ఎంత నీటిని సేకరించవచ్చు, ఏ మార్గాల్లో తరలించవచ్చు అని అధికారులతో చర్చించారు. వేసవిలో తాగునీటి డిమాండ్ పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రతి జలవనరును సమర్థంగా వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
దీనిని కూడా చదవండి : Kulgam Terror Attack | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి