KTR Revanth Reddy | రేవంత్​రెడ్డి నా గడ్డం గురించే ఆలోచిస్తుండు : కేటీఆర్​

రాష్ట్రంలో రైతులు సమస్యలతో బాధ పడుతుంటే పట్టించుకోని సీఎం, తన గడ్డం గురించి ఆలోచిస్తున్నారని కేటీఆర్​ విమర్శించారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Revanth Reddy | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​, సీఎం రేవంత్​రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఆయనకు తన గడ్డం గురించి ఫికర్ పట్టుకుందన్నారు. రాష్ట్రంలో రైతులు సమస్యలతో బాధ పడుతుంటే పట్టించుకోని సీఎం, తన గడ్డం గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు.

నిర్మల్​ (Nirmal)లో నిర్వహించిన రైతు గర్జన (Rythu Gharjana) సభలో కేటీఆర్​ మాట్లాడారు. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి, కేటీఆర్​ గడ్డం గురించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనలా కేటీఆర్​ గడ్డం పెంచుకుంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కేటీఆర్​ స్పందించారు. ‘‘నేనంట రేవంత్‌ను నకలు కొడుతున్నా అని అంటున్నారు. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా అలా అనుకుంటారా?. రేవంత్‌ను ప్రజలు తిట్టే తిట్లకు ఎవరైనా బకెట్‌లో నీళ్లు పోసుకొని చచ్చిపోతారు’ అని కేటీఆర్​ వ్యంగ్యంగా స్పందించారు.

KTR Revanth Reddy | రైతు కష్టం తెలిసిన కేసీఆర్​

కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడు భూముల్లో నీరు పారించిన నేత కేసీఆర్ అన్నారు. తుమ్మలు మొలిచిన కాకతీయ, SRSP కాలువల్లో నీళ్ళు పారించారని చెప్పారు. రైతుల కష్టం తెలిసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో కరువు, ఆత్మహత్యలే ఉండేవన్నారు. ప్రస్తుతం మళ్లీ కరువు తాండవం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గోదావరి నది ఒడ్డున ఉన్న నిర్మల్ జిల్లాలో 9 కరువు మండలాలు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. పంపులు ఆన్ చేసి నీళ్ళు ఎత్తి పారించే సదుపాయం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి కావాలని ఎత్తిపోయకుండా కరువు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR Revanth Reddy | హామీలు అమలు చేయని ఎమ్మెల్యే

ఎన్నికల ముందు నిర్మల్ ప్రజలకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా చేసి, మెడికల్ కాలేజీ ఇచ్చి, సదర్మాట్ బ్యారేజ్ కట్టించింది కేసీఆర్ అన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచినా.. కేంద్రం నుంచి నిధులు తేవడం లేదని విమర్శించారు. మహారాష్ట్ర, ఏపీకి కేంద్రం నుండి కరువు బృందాలు వెళ్ళాయని, మరి తెలంగాణకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారన్నారు.

దీనిని కూడా చదవండి : Stock Market Closing | లాభాలతో ముగిసిన సూచీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *