అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Care Degree College Bathukamma | నగరం (Nizamabad)లోని కేర్ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కళాశాల విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొన్నారు.
Care Degree College Bathukamma | భక్తితో బతుకమ్మను పేర్చి..
బతుకమ్మ వేడుకల్లో భాగంగా నాల్గో రోజు నానబియ్యం బతుకమ్మ వేడుకలను కళాశాలలో నిర్వహించారు. బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. పువ్వులను ఒక దేవతగా భావించి పూజించి పండుగ చేయడం ఒక గొప్ప ఆధ్యాత్మిక భావన అని మహిళా అధ్యాపకులు అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అనురాధ, సునితారాణి, మౌనిక, గంగమణి, శ్రీవిద్య, శ్రీలత అరుణ, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Urban Development | నగరంలో అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం..: ఎమ్మెల్యే ధన్పాల్