CDS Raja Subramani | చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CDS Raja Subramani | కీలక సైనిక నియామకాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి Raja Subramani (రిటైర్డ్‌)ను దేశ కొత్త చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు.

CDS Raja Subramani | డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మిలిటరీ అఫైర్స్‌కు

అదేవిధంగా, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మిలిటరీ అఫైర్స్‌కు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా కూడా ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి వ్యవహరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

సాయుధ దళాల్లో విశేష సుదీర్ఘ అనుభవం ఉన్న రాజా సుబ్రమణి, భారత సైన్యంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశ రక్షణ వ్యవస్థ సమన్వయం, సైనిక వ్యూహాల రూపకల్పనలో సీడీఎస్‌ పదవి కీలకంగా భావిస్తారు. కొత్త సీడీఎస్‌గా నియామకంపై రక్షణ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *