Cyber Crime Drug Control | సైబర్​ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణలో కట్టుదిట్టంగా వ్యవహరించాలి : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో సైబర్​ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణలో కట్టుదిట్టంగా వ్యవహరించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Cyber Crime Drug Control | నిజామాబాద్ (Nizamabad Police)​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో సైబర్​ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణలో కట్టుదిట్టంగా వ్యవహరించాలని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. జక్రాన్​పల్లి పోలీస్​స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Cyber Crime Drug Control | సీసీ కెమెరాలు ప్రారంభం

జక్రాన్​పల్లి పోలీస్ స్టేషన్​లో ‘మన ఊరు ‌‌–మన భద్రత– మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా 25 సీసీ కెమెరాలను సీపీ సాయిచైతన్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. జక్రాన్​పల్లి గ్రామంలో 25 సీసీ కెమెరాలు పెట్టుకునేందుకు సహకరించిన పంచాయతీని సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్​ ఏసీపీ ప్రకాశ్​, సీసీఆర్​బీ ఏసీపీ గురు నాయుడు, డిచ్​పల్లి సీఐ తిరుపతి, జక్రాన్​పల్లి ఎస్సై మహేష్, సర్పంచ్ బండి పద్మసత్యం, మండల అధ్యక్షుడు రెక్కల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

cp123

ఇది కూడా చదవండి: Prohibited Lands | నిషేధిత భూములపై ఆందోళన వద్దు.. మంత్రి పొంగులేటి భరోసా

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *