అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Government Jobs | సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 75 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. తాజాగా భర్తీ చేయనున్న పోస్టుల్లో 2 వేల హోంగార్డు కొలువులు కూడా ఉన్నాయన్నారు.
అచ్చంపేటలో చేయూత పింఛన్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేశారు. దేశంలో 50 ఏళ్ల క్రితం బీజేపీ లేదని, పాతికేళ్ల క్రితం బీఆర్ఎస్ లేదన్నారు. బీజేపీ అధికారం కోల్పోతే ఆ పార్టీ చచ్చిన పాము అవుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఆ పార్టీ అధినేత ఫామ్‌హౌస్‌లో ఎత్తిపోతల పథకంలో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Government Jobs | ప్రాజెక్టులు పడావు పెట్టారు
పాలమూరు జిల్లా ప్రాజెక్టులను కేసీఆర్ పదేళ్లపాటు పడావు పెట్టారని సీఎం విమర్శించారు. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే.. ఇవాళ నీళ్లు ఎత్తిపోయలేకపోతున్నామని చెప్పారు. ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ రూ. 1.80 లక్షల కోట్లు ఖర్చు చేశారని, పాలమూరు ప్రాజెక్టుల కోసం రూ. 10 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. పాలమూరు అంతటా కృష్ణా నీళ్లు తెచ్చి రుణం తీర్చుకుంటానని తెలిపారు.
Government Jobs | అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అచ్చంపేట బహిరంగ సభ ప్రాంగణంలో రూ.379.07 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. రూ.274.32 కోట్లతో నాగర్ కర్నూల్ జిల్లాలో బీటీ రోడ్ల అభివృద్ధికి, నాగర్‌కర్నూల్, పెద్ద కొత్తపల్లి, వెల్దండ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు, అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అచ్చంపేట బహిరంగసభ వేదికగా చేయూత కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
Achampet Public Meeting: CM Revanth Reddy Launches Distribution of New Cheyutha Pensions
#CheyuthaPensions #RevanthReddy #Telangana https://t.co/EpXSB6A4H1
— Congress for Telangana (@Congress4TS) November 26, 2026
దీనిని కూడా చదవండి : Telangana RERA Fines | రియల్ ఎస్టేట్ అక్రమార్కులకు రెరా షాక్.. ఏలియన్స్‌కు రూ.2 కోట్లు, ఆరో రియాల్టీకి రూ.25 లక్షల జరిమానా!